టాలీవుడ్ లో అంగవైకల్యం ఉన్న సినీ తారలు వీళ్ళే.

టాలీవుడ్ హీరోలు త‌మ పంథాను మారుస్తున్నారు. ఎప్పుడూ మూస‌ధోర‌ణీలోనే కాకుండా విభిన్నక‌థ‌లు ఎంచుకుంటూ ముందుకుసాగుతున్నారు. ఒక‌ప్పుడు చిన్నా, పెద్ద హీరోలు ఎవ‌రైన స‌రే త‌మ సినిమాలో ఫైట్స్, ఆరు పాటలు, నాలుగు డైలాగ్స్ అనే ధోర‌ణిలో సినిమాలు చేసేవారు. మ‌రి కొంద‌రూ హీరోలు అయితే ఐట‌మ్ సాంగ్స్ క‌చ్చితంగా కావాల‌ని ప‌ట్టుప‌ట్టేవారు. వారు కోరుకున్న విధంగా క‌థ‌లు రెడీ చేస్తే అస‌లు థీమ్ పోతుంది. అయితే అంగవైకల్యం ఉన్నా సరే ఎన్నో సాధిస్తుంటారు.

ఇంకా ఈ నేపథ్యంలోనే కొందరు టాలీవుడ్ స్టార్లకు కూడా అంగవైకల్యం ఉందట. కానీ ఆ విషయం ఎంతోమందికి తెలియదు. అవును ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికి నిజంగానే కొందరు స్టార్స్ కి అంగవైకల్యం ఉందట. రానా..ఇటీవల అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొన్న రానా కూడా అంగవ్యకల్యంతో బాధపడ్డాడు.అతనికి కేవలం ఒక కన్ను మాత్రమే కనిపిస్తుందట.అందుకే బయటకు వచ్చినప్పుడు గ్లాసెస్ దరిస్తాడట. నితిన్..జయం సినిమాతో మంచి హిట్ అందుకున్న నితిన్ కి కూడా ఒక లోపం ఉంది.అదే నత్తి. నితీన్ కి మొదట్లో శివాజీ డబ్బింగ్ చెప్పేవాడట.తర్వాత క్రమంగా అలవాటు పడి తనే చెప్పుకుంటున్నాడట.

అలీ..ప్రముఖ కమెడియన్ అలీ కూడా నితిన్ లానే నత్తి ఉండేదట.మొదట్లో ఈ సమస్యతో ఇబ్బంది పడినప్పటికి క్రమంగా అది తగ్గి అద్భుతంగా మాట్లాడుతున్నాడట. అభినయ..శంభో శివ శంభో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి హిట్ సినిమాల్లో నటించిన ఈ అమ్మాయికి చెవుడు, మూగ. కానీ ఎంతో తెలివితో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సుధా చంద్రన్..అప్పట్లో మయూరి వంటి చిత్రాల్లో నటించి ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తున్న ఈ నటికి కాలు లేదు.కానీ అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది.అంతకంటే అద్భుతంగా నటిస్తుంది. చూశారుగా.వీళ్ళే అంగవైకల్యంతో బాధపడుతున్న టాలీవుడ్ స్టార్స్. ఎన్ని లోపాలు ఉన్న వారి కోరిక బలంగా ఉండడంతో మంచి స్థానంలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *