యంగ్ యాంకర్ విష్ణు ప్రియ విరహ వేదన గురించి ఎంత చెప్పినా తక్కువే. బోల్డ్ గా మాట్లాడటం అమ్మడి నైజం. గతంలో చాలాసార్లు ఇలా మాట్లాడి వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిన ఈ బ్యూటీ.. మరోసారి అలాంటి బోల్డ్ కామెంట్స్ చేసింది. అయితే ఈ సారి పెళ్లి, శోభనం గురించి ఆమె మాట్లాడటంతో అంతా స్టన్ అవుతున్నారు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇంటర్వ్యూలో పాల్గొంది. అక్కడే అనేక కామెంట్లు చేసి ఎవరూ ఊహించని స్థాయిలో షాక్ ఇచ్చింది. ముఖ్యంగా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ గురించి వివరించింది.
గతంలో తనకు చాలా మందే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని… అయితే వారితో తాను ఇప్పటికీ టచ్ లోనే ఉన్నానని చెప్పుకొచ్చింది. కేవలం టచ్ లో ఉండడమే కాదు, వారిని తాను ఇప్పటికీ ప్రేమిస్తున్నట్లు చెబుతూ షాక్ ఇచ్చింది తన ప్రాణం ఉన్నంత వరకు వారిని ప్రేమిస్తూనే ఉంటానని కూడా స్టేట్ మెంట్ పాస్ చేసింది విష్ణు ప్రియ. అయితే వారిలో తనకు ఏదో ఒక క్వాలిటీ నచ్చే, ఇష్టపడే వారితో ప్రేమలో పడ్డానని, కానీ మిగతా విషయాల్లో తమ మధ్య సఖ్యత కుదరక బ్రేకప్ చెప్పుకున్నామని విష్ణుప్రియ తెలిపింది.
అయితే తనకు నచ్చిన క్వాలిటీలు ఇప్పటికీ వాళ్లలో ఉన్నందు వల్ల వాళ్ల మీద తనకు ఇంకా ప్రేమ చావలేదని ఎప్పటికీ చావదని కూడా వెల్లడించింది. బ్రేకప్ చెప్పుకున్న తర్వాత కూడా ఒక్కసారి కూడా తాను వాళ్లతో మాట్లాడకుండా ఉండలేదని క్లారిటీ ఇచ్చింది. తన గురించి చాలా బాగా తెలిసిన తన ఎక్స్ బాయ్ ప్రెండ్సే తన కుటుంబ సభ్యులు అని. వారు ఎప్పటికీ తను సపోర్ట్ సిస్టమ్ గా ఉంటారని విష్ణుప్రియ స్పష్టం చేసింది. మేమంతా మంచి స్నేహితులం అని కలిసి ఒక కూర చేయలేకపోయిన మాత్రానా కొట్టుకు చావాల్సిన అవసరం లేదని, మాట్లాడకుండా ఉండాల్సిన అవసరం కూడా లేదని తేల్చి చెప్పింది.