తాజాగా రష్మీ షేర్ చేసిన పోస్ట్ అందరినీ ఎమోషనల్ చేసింది. రష్మీకి జంతువులు అంటే చాలా ఇష్టం.. అంతే కాదు జంతు హింసను ఆమె అస్సలు సహించరు. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ఘాటుగా స్పందిస్తుంది. జంతువుల పట్ల విపరీతమైన ప్రేమను చూపించే రష్మీ.. తాజాగా తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కను కోల్పోయింది.
దీంతో ఈ విషయాన్నీ తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. “నా సాసీ ప్రిన్సెస్ బంగారంతో గడిపిన చివరి 24 గంటల జ్ఞాపకాలు. లవ్ యు మై బేబీ గర్ల్. అంటిల్ నెక్స్ట్ టైం .. చుట్కీ గౌతమ్ (కుక్క) సైనింగ్ ఆఫ్” అంటూ తన కుక్క మరణించినట్లు పోస్ట్ షేర్ చేసింది.

అలాగే తన కుక్కతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది. జంతువుల ప్రాణానికి ఎంతో విలువను ఇచ్చే రష్మీ.. తన కుక్క (చుట్కీ) చితాభష్మాన్ని తనతో పాటు ఇంటికి తెచ్చుకుంది. దీనికి సంబందించిన ఫోటోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈమె పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.