అనసూయ..చిన్న పాత్రే అయిన ఓ పక్క గ్లామర్ షో చేస్తూనే మరోపక్క ఇంటిమేట్ సన్నివేశాల్లో అదరగొట్టింది. ప్రస్తుతం పుష్ప2లో నటిస్తోంది. ఇక యాంకర్ అనసూయ ఇటీవల తన భర్తతో విదేశాల్లో వెకేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. తన పెళ్లి రోజు కావడంతో భర్తతో ఎంజాయ్ చేస్తూ.. కొన్ని ఫోటోలను, వీడియోలను పంచుకుంది. అయితే ఈ ఫోటోలపై నెటిజన్స్ రకరకాలుగా స్పందించారు. ఇక చాలు అనసూయ.. నీ బికినీ ఫోటోలు.. ఆపండి అంటూ కొందరు కామెంట్స్ చేస్తే.. మరికొందరేమో..
ఈ ఏజ్‌లో కూడా అంత ఫిట్‌గా ఉండడం మామూలు విషయం కాదంటూ పోగుడుతున్నారు. ఏది ఏమైనా మరోసారి ఆమె ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే బుల్లితెర క్వీన్ గా టెలివిజన్ రంగాన్ని ఏలిన అనసూయ.. సినిమాల్లో కూడా తనదైన మార్కు చూపించారు. ఒక పక్క సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నర్తిస్తూనే.. మరో వైపు క్షణం, రంగస్థలం, పుష్ప వంటి సినిమాల్లో నటనకి స్కోప్ ఉన్న సినిమాల్లో నటిస్తూ అభిమానులని మెప్పిస్తున్నారు. క్షణం సినిమాలో ఆమె నటనకు గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఐఐఎఫ్ఏ ఉత్సవం, సైమా అవార్డులు వరించాయి. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా మెప్పించిన అనసూయకి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్, సైమా, జీ సినీ అవార్డులు వరించాయి.
బుల్లితెర మీద షోలు, సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో ఎప్పుడూ అభిమానులని అలరిస్తుంటారు. రెగ్యులర్ గా అనసూయ సోషల్ మీడియాలో ఏదో ఒక అప్ డేట్, ఫోటోలు, పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తుంటారు. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మేకప్ లేని ఫోటోలని షేర్ చేశారు. గతంలో కూడా ఆమె మేకప్ లేకుండా ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం, లైవ్ లో వీడియో చాట్ చేయడం లాంటివి చేశారు. ఇప్పుడు కూడా అలానే ఇంట్లో మేకప్ లేకుండా తీయించుకున్న ఫోటోలను అప్ లోడ్ చేశారు. అయితే ఆ ఫోటోల్లో కూడా అనసూయ అందంగానే ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.