అనసూయ భరధ్వాజ్..ఆమె 2008లో భద్రుక కళాశాల నుండి ఎం.బి.ఎ చేసింది. ఫిక్స్ లాయిడ్ అనే కంపెనీలో హెచ్. ఆర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసింది. అనేక సినిమాలలో అవకాశాలను వదిలి ఆమె సాక్షి టివి లో టెలివిజన్ వ్యాఖ్యాతగా పనిచేసింది. అయితే గత కొన్నేళ్లుగా తెలుగులో నటిగా మంచి అవకాశాలు రావడంతో ఈమె జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పింది.
ప్రస్తుతం ఈమె నటించిన ‘రజాకార్’ విడుదలకు రెడీగా ఉంది. మరోవైపు పుష్ప 2 మూవీపై భారీ ఆశలే పెట్టుకుంది. మరోవైపు ఒకటి రెండు బడా సినిమాలు తప్పించి ఈమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈమె ఛాన్సుల కోసం ఈమె తన రెమ్యునరేషన్‌లో భారీ కోత విధించిందనే టాక్ వినిపిస్తోంది.
అయితే అలాంటిదేమి లేదని ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెమ్యునరేషన్ తగ్గించే క్వశ్చన్ లేదనే వాదన ఆమె సన్నిహితుల నుంచి వినిపిస్తోంది. మరోవైపు ఛాన్సుల కోసం ఈమె వరుస ఫోటో షూట్స్‌ను కూడా నమ్మకుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా అనసూయ పారితోషకం తగ్గింపు వార్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.