కళ్ళు తెరిచి భక్తులను చూస్తున్నా లక్ష్మీదేవి విగ్రహం. ఓ మహిళకు పూనకం.. ఏం చెప్పిందంటే..?

కడియం మండలం కడియాపు లంక చింతలోని అమ్మవారి విగ్రహం కళ్ళు తెరిచి భక్తులను చూడడం వల్ల ఆ దేవాలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది.సాధారణంగా దేవత విగ్రహాలు కన్నుమూసి ఉన్నట్లుగా సగం మాత్రమే తెరిచి ఉన్నట్లుగా, చాలా విగ్రహాలను గుడికి వెళ్ళినప్పుడు చూసే ఉంటారు.కానీ ఇక్కడ అమ్మవారి కళ్ళు సడన్గా తెరవడం ఇదంతా దేవి మహిమే అని అక్కడి భక్తులు చెబుతున్నారు.

అయితే సాధారణంగా దేవతా విగ్రహాలు కళ్లు మూసి ఉన్నట్లు గాని, సగం మాత్రమే తెరిచి ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ అమ్మవారి కళ్లు సడెన్ గా తెరుచుకోవడం ఇదంతా దేవి మహిమే అంటున్నారు. అమ్మవారి లీలతోనే ఇలా జరిగిందని చెబుతున్నారు కొంతమంది ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్‌గా మారింది. విగ్రహం పాలు తగడం.. పాము శివుడికి పూజ చేయడం.. ఆవు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం.. ఆంజనేయుడు కళ్లు తెరవడం..

కొబ్బరి కాయ వినాయకుడి రూపంలో ఉండడం.. రాముడు కన్నీరు కార్చడం.. ఇలా నిత్యం వీటి గురించి వింటూ ఉంటాం.. కానీ దీనికి కారణం ఏంటి అన్నది మాత్రం తెలియడం లేదు. వింత ఘటనలుగానే మిగిలి పోతున్నాయి. హిందువుల్లో ఎక్కువమంది దేవుళ్లకు మహిమలు ఉన్నాయని గట్టిగా నమ్ముతారు. వారి నమ్మకాలను ఇలాంటి ఘటనలు నిజమే అనేలా చేస్తున్నాయి. దేవుళ్ళనే కాదు.. ప్రకృతిలోని జంతువులను, పక్షులను కూడా అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే సంప్రదాయం భారతీయుల సొంతం. అందుకే రాయిలో కూడా దేవుని ప్రతిరూపాన్ని చూసుకుని పూజలు చేస్తుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *