రాజమండ్రి వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న అంబటి రాంబాబు కాన్వాయ్‌పై పక్కనే వెళుతున్న లారీపై నుంచి గోధుమ బస్తాలు పడిపోయాయి. ప్రమాదంలో అంబటి రాంబాబు కార్ స్వల్పంగా దెబ్బతినడంతో మంత్రి మరో వాహనంలో వెళ్లిపోయారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమని టీడీపీ నాయకులు, పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారని.. భువనేశ్వరి కూడా ఇదే మాట మాట్లాడుతున్నారన్న మంత్రి అంబటి రాంబాబు..
చంద్రబాబు అరెస్ట్ చాలా సక్రమమని వ్యాఖ్యానించారు. చట్టబద్ధమైనది కూడా అని అన్నారు. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు ముందు ప్రవేశపెడతారని, కక్ష సాధింపు చేస్తే రిమాండ్ రిజెక్ట్ చేసేవారని తెలిపారు. చంద్రబాబు తరపున ఢిల్లీ నుంచి వచ్చే పెద్ద పెద్ద అడ్వకేట్లు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో వాదిస్తున్నారన్నారు. ప్రాథమిక ఆధారాలు ఈ కేసులో ఉన్నాయన రిమాండ్ కు పంపారని మంత్రి అంబటి తెలిపారు.
ఇది ఎలా అక్రమ అరెస్ట్ అవుతుందని టీడీపీ నేతలను అంబటి నిలదీశారు. భువనేశ్వరికి చంద్రబాబు అరెస్ట్ అక్రమంగా కనిపించడం సహజం.. భర్త అవినీతిపరుడైనా మంచివాడిగానే భావిస్తుందని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు. అయితే, ప్రజలు అందరూ కూడా అలా అనుకోవాలని కోరుకోవడం కరెక్ట్ కాదని అన్నారు.