వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి ఇండియాలోని టాప్ స్టార్స్ కి కూడా ఇన్విటేషన్ వెళ్ళింది. ప్రముఖ రాజకీయ నాయకులు, బాలీవుడ్ స్టార్స్ ఈ సెలబ్రేషన్స్ కి గెస్ట్‌లుగా హాజరవుతున్నారు. ఈక్రమంలోనే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన ఫ్యామిలీతో సహా కలిసి ఇప్పటికే జమ్‌నగర్ చేరుకున్నారు.
ఇక స్టార్ ఈవెంట్ కి టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ జంటకి కూడా ఆహ్వానం అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ అండ్ ఉపాసనకి ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఇన్విటేషన్ అందిందని, వారు ఇద్దరు కూడా ఆ సెలబ్రేషన్స్ కి వెళ్ళబోతున్నారని టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది.
మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే.. కొంచెం వేచి చూడాల్సిందే. కాగా సంగీత్ ఫంక్షన్ తో మొదలవుతున్న ఈ సెలబ్రేషన్స్ లో రిహన్న మ్యూజిక్ కాన్సర్ట్ ఇవ్వబోతున్నారు. ఇందుకోసం కాన్సర్ట్ కావాల్సిన భారీ ఎక్విప్మెంట్స్ ఫ్లైట్ లో ఇండియాకి చేరుకున్నాయి.