ముకేశ్ అంబానీ, నీతా అంబానీ ల తనయుడు అనంత్ అంబానీ , విరెన్ మర్చెంట్, శైల దంపతుల కూతురైన రాధికా మర్చంట్‌ను పెళ్లిచేసుకోబోతున్నారు. వీరిద్దరి రోకా వేడుక (నిశ్చితార్థం) రాజస్తాన్‌లోని నథ్‌ద్వారాలో శ్రీనాథ్‌జీ ఆలయంలో జరిగింది. ఈ వేడుకలో ముకేశ్ అంబానీ, విరెన్ మర్చెంట్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఆలయ పూజారులు పాల్గొన్నారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ శ్రీనాథ్‌జీ దేవుడి ఆశీస్సులు కోరుతూ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయంలో సాంప్రదాయ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే అనంత్ అంబానీ మాట్లాడుతూ.. “నా జీవితంలో ప్రత్యేకమైన రోజును నాకు సంతోషాన్ని ఇవ్వడానికి నా కుటుంబ మొత్తం కష్టపడింది. నన్ను సంతోషంగా ఉంచేందుకు మా ఎంతో చేశారు. ఆమె రోజుకు 18 – 19 గంటలు కష్టపడ్డారు.
ఈ ఈవెంట్ ప్రత్యేకంగా చేసేందుకు గత రెండు మూడు నెలలుగా నా కుటుంబమంతా కేవలం 3 గంటలే నిద్రపోయింది. మీ అందరికీ తెలుసు.. నా జీవితం పూర్తిగా పూలపాన్పు కాదు.. ఎన్నో ముళ్ళు గుచ్చుకున్నా బాధను అనుభవించాను. చిన్నప్పటి నుంచి చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. కానీ ఆ బాధను మర్చిపోయేలా నా తల్లిదండ్రులు నాకు అండగా నిలిచారు. జీవితంలో నేను ఏది కావాలనుకుంటే అది చేయగలనని నాకు భరసా ఇచ్చారు.
ఆసమయంలో నా తల్లితండ్రుల ప్రేమ నాకు పూర్తిగా అర్థమైంది. నాకు ఎల్లప్పుడూ మద్దతుగా.. నాతో బలంగా నిలబడిన మా అమ్మ నాన్నలకు ధన్యవాదాలు” అని చెప్పారు. కుమారుడి మాటలు వింటూ ముఖేష్ అంబానీ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
A father can feel the pain of his child in his own flesh and soul.#AnantRadhika #MukeshAmbani pic.twitter.com/I52UGOljOm
— Abhijit Majumder (@abhijitmajumder) March 2, 2024