షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతంది.. మూవీ రిలీజ్ ఎప్పుడంటూ ఫ్యాన్స్ అంతా ఆరాటపడుతున్నారు. పైగా అప్పుడు అప్‌డేట్స్ వదిలి మూవీ బజ్ పెంచాడు సుకుమార్. దీంతో పుష్ప 2 రిలీజ్ కోసం ఫ్యాన్స్ అంత ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు. అయితే అయితే పుష్ప సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఎంతో గొప్ప పేరు వచ్చింది.
అలాగే ఈ సినిమాలో హీరో స్నేహితుడు కేశవ పాత్రలో నటించిన జగదీశ్‌కు కూడా చాలా మంచి పేరు వచ్చింది. దీంతో జగదీశ్ వరుస సినిమాలతో మంచి బిజీగా ఉన్నాడు. అయితే.. అతడిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళ ఆత్మహత్మ కేసులో అతడిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. పంజాగుట్ట పరిధిలో ఓ మహిళ (జూనియర్ ఆర్టిస్టు) నివాసం ఉంటోంది. అయితే.. గత నెల 29న ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
దీనిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో పోలీసులు ఆ మహిళ బలవన్మరణానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఆమె ఓ వ్యక్తితో ఉన్న సమయంలో జగదీశ్ ఆమెకు తెలియకుండా ఫోటోలు తీశాడు. ఆ ఫోటోల సాయంతో ఆమెను బెదిరించాడు. దీంతో ఆ మహిళ మనస్థాపానికి గురైంది. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో జగదీశ్‌ను బుధవారం అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కాగా.. ఆ మహిళకు జగదీశ్‌కు గతంలో పరిచయం ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.