రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డు కింద అల్లు అర్జున్ కు ఓ జ్ఞాపిక, ప్రశంసాపత్రం బహూకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ చప్పట్లతో మార్మోగిపోయింది. అయితే ఢిల్లీ వేదికగా జరిగిన జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ పురస్కారం అందుకున్నారు అల్లు అర్జున్.
తద్వారా 69 ఏళ్ల సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్న మొదటి తెలుగు హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. దీంతో ఈ స్టైలిష్ హీరోకు అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు బన్నీకి కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో అల్లు అర్జున్ వెంట అతని సతీమణి స్నేహలతా రెడ్డి కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ద్రౌపది ముర్ముతో పాటు పలువురు కేంద్రమంత్రలు పాల్గొన్నారు.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు గానూ ఈ అవార్డు అందుకున్నారు బన్నీ. ఎర్రచందనం స్మగ్గింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా లో పుష్పరాజ్ గా కనిపించాడు అల్లు అర్జున్. నేషనల్ క్రష్ రష్మిక మంధన్నా హీరోయిన్ గా నటించింది. అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సమంత ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఇప్పటికీ చాలా చోట్ల ఈ సినిమా డైలాగులు, పాటలు రీక్రియేట్ చేస్తున్నారు.
#WATCH | Allu Arjun receives the Best Actor Award for 'Pushpa: The Rise', at the National Film Awards. pic.twitter.com/FemqdiV41y
— ANI (@ANI) October 17, 2023