అలీ మాత్రం పలు సందర్భాల్లో పవన్ తో తనకు గ్యాప్ లేదని చెప్పిన సంగతి తెలిసిందే. పవన్ తన సినిమాలలో అలీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నా ఇతర కమెడియన్లకు ఎక్కువగా అవకాశాలను ఇస్తుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ అలీ మధ్య గ్యాప్ తగ్గితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
పవన్, అలీలను అభిమానించే అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉంది. పవన్, అలీ చిన్నచిన్న మనస్పర్ధలను తొలగించుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే మధ్యలో మాత్రం రాజకీయపరంగా వీరికి తీవ్రస్థాయిలో విభేదాలు రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గత ఎన్నికల్లో ప్రచారాలు నిర్వహించడమే కాకుండా పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ కూడా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఆలీ పేరు ఎత్తకుండానే కౌంటర్ ఇచ్చిన ప్రయత్నం చేశారు. దీంతో మీరు మధ్యలో గ్యాప్ వచ్చేసింది.