ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగొందింది నటి సుకన్య. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ముఖ్యంగా ‘భారతీయుడు’ సినిమాలో కమల్ హాసన్ భార్యగా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు, కెప్టెన్, ఖైదీ నెంబర్ వన్ తదితర సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. మధ్యలో కాస్త గ్యాప్ తీసుకున్నప్పటికీ సాంబ, శ్రీ, మున్నా, అధినాయకుడు, శ్రీమంతుడు తదితర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించింది.
అయితే కెరీర్ పీక్ లో ఉన్న నటి సుకన్య 2002లో పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడింది. 2002 మార్చి 18 న అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీరు అయిన శ్రీధర్ ని పెళ్ళి చేసుకొని అమెరికాలో స్థిరపడింది. ఒక కుమారుడు , కుమార్తె పుట్టిన తర్వాత ఆమె వైవాహిక జీవితం అభిప్రాయ భేదాల కారణంగా విడాకులతో ముగిసింది.వెండితెరపై అవకాశాలు తగ్గిపోవడంతో సుకన్య స్మాల్ స్క్రీన్‌పై పలు సీరియల్స్‌లో నటించడం ప్రారంభించింది.

సుకన్యకు భరతనాట్యం అంటే ఎనలేని ప్రేమ ఉంది మరియు తరచూ భరతనాట్య ప్రదర్శనలలో పాల్గొంటుంది. తన కూతురితో నివసిస్తున్న ఆమె తన కూతురిని సినిమా సంబంధిత కార్యక్రమాలకు తీసుకురాలేదు. సుకన్య తన కుమార్తెను మీడియాకు దూరంగా ఉంచింది.ఈ నేపథ్యంలో నటి సుకన్య కూతురు ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.