ఆధార్ కార్డులో ఫోటో అప్డేట్ చేయాలంటే ఆధార్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలి. ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలంటే ముందు స్లాట్ బుక్ చేయాలి. స్లాట్ ఎలా బుక్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఆధార్ సెంటర్‌కు వెళ్లిన తర్వాత దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే రూ.100 సర్వీస్ చార్జ్..మీ ఆధార్ కార్డు ఫొటోను సులభంగా మార్చుకోవచ్చు. అందుకోసం మీరు ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ఆధార్ కార్డులో బయోమెట్రిక్, ఫొటోలను అప్ డేట్ చేయడం ఆన్ లైన్లో కుదరదు.
ఆధార్ సేవా కేంద్రాల్లోనే దీనిని చేసేందుకు వీలుంటుంది. అందుకోసం రూ. 100 సర్వీస్ చార్జ్ కూడా ఆధార్ సెంటర్ వారు వసూలు చేస్తారు. ఆధార్ కార్డ్ ఫోటో మార్చడం ఇలా.. మీ సమీపంలోని ఆధార్ శాశ్వత నమోదు కేంద్రాన్ని సందర్శించండి. ఆన్లైన్ లేదా సెంటర్లో అందుబాటులో ఉండే ఎన్రోల్మెంట్ ఫారమ్‌ను పూరించండి. ఆ ఫారమ్‌ను సమర్పిస్తే.. అక్కడి ఎగ్జిక్యూటివ్ మీ ఫొటో తీస్తారు. బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయడానికి రూ. 100 చెల్లించండి. కొత్త ఫొటో అప్డేట్ చేసిన ఆధార్ కార్డ్‌ని డౌన్లోడ్ చేయడం ఇలా.. యూఐడీఏఐ అధికారిక పోర్టల్‌లోకి వెళ్లండి.
హోమ్‌పేజీలోని మై ఆధార్ విభాగంలో ‘డౌన్లోడ్ ఆధార్’ ఎంపికపై క్లిక్ చేయండి. ఈ-ఆధార్ డౌన్లోడ్ కోసం ‘ఆధార్ నంబర్’, ‘ఎన్రోల్మెంట్ ఐడీ’ వర్చువల్ ఐడీ మధ్య ఎంచుకోండి. ఇప్పుడు మీ ఎంపిక వివరాలను నమోదు చేయండి. మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు ఓటీపీని పంపే ముందు క్యాప్చా కోడ్‌ను ధ్రువీకరించండి. ప్రక్రియను ధ్రువీకరించడానికి ఓటీపీని నమోదు చేయండి. మీ ఆధార్ కార్డు పాస్వర్డ్ ప్రొటెక్షన్ తో మీ పరికరంలో డౌన్లోడ్ అవుతుంది. యూఐడీఏఐ ప్రకారం, మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు (క్యాప్స్‌లో), మీ పుట్టిన సంవత్సరం అనేది ఈ ఇ-ఆధార్ పాస్వర్డ్ గా ఉంటుంది.