అందంగా సాగుతున్న జీవితం, రత్నాల్లాంటి పిల్లలు, అంతలోనే భార్యభర్తల మధ్య ఉన్నట్లుండి పెద్ద అగాధం. దీనికి కారణం అక్రమ సంబంధం. అక్రమ సంబంధం దాంపత్య సుఖాన్ని పాడు చేస్తుంది.
పచ్చని సంసారంలో చిచ్చు పెడుతుంది. భాగస్వాములిద్దరిలో ఏ ఒక్కరి విషయంలో అయినా అక్రమ సంబంధం బయటపడితే, అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. అయితే భార్యాభర్తలు లేదా స్త్రీపురుషుల మధ్య సంతృప్తికరమైన శృంగార సుఖం లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
బెడ్రూంలో తన భర్త లేదా భార్య ద్వారా సంతృప్తి పొందలేని స్త్రీ లేదా పురుషుడు ఈ తరహా సంబంధాలపై ఆసక్తి చూపుతున్నారు. అలాగే, శృంగారంలో తన శరీర అందాలను పురుషుడు అసహ్యించుకున్నట్టయితే ఆ స్త్రీ అతనితో శృంగారంలో పాల్గొనేందుకు ఏమాత్రం ఇష్టపడదు. దీంతో పరాయి పురుషుని వైపు చూస్తుంది.