ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వం తన మార్క్‌గా చెప్పుకున్న వాటిలో వాలంటీర్ల వ్యవస్థ ఒకటి. గ్రామ, వార్డ్ సచివాలయాలు ఏర్పాటు చేసి.. వాటికి వాలంటీర్లను నియమించి.. ప్రతీ 50 ఇళ్లకూ ఒక వాలంటీర్‌ను ఏర్పాటు చేశారు. తద్వారా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ డోర్ టు డోర్ చేరేలా చేశారు. అలాగే పథకాలకు ఇచ్చే డబ్బు విషయంలో కూడా ఎక్కడా మధ్యవర్తుల జోక్యం లేకుండా చేశారు. దాంతో వాలంటీర్ వ్యవస్థ ఏపీలో కీలకంగా మారింది.
వాళ్లు లేకపోతే, ప్రభుత్వం లేదనే స్థాయిలో అది కనిపించింది. అయితే గురువారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీలతో నిర్వహించిన భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రసుత్తం టీడీపీ, జనసేన హానీమూన్ నడుస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి కొంత గడువు ఇచ్చిన తరువాత శిశుపాలుడు మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించి గట్టిగా పోరాటం చేద్దామని సూచించారు. ఇప్పటికీ 40 శాతం మంది ప్రజలు వైసీపీ వైపే ఉన్నారని, ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు మరిచిపోవద్దని వెల్లడించారు.
త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని, మనపై కేసులు పెట్టినా భయపడొద్దని కోరారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీలో నోరు మెదపకుండా కట్టడి చేసే అవకాశముందని జగన్ అన్నారు. ప్రభుత్వ తీరు, ఎన్నికల ఫలితాలపై విశ్లేషించుకున్న తరువాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాటాలు చేద్దామని పేర్కొన్నారు.