ఎన్టీఆర్ అసహనం, ఇంత కోపంగా ఎప్పుడూ చూసుండరు. ఏం జరిగిందంటే..?

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్ 2 షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. హైదరాబాద్ లో దేవర షూటింగ్ చేస్తూ మరో ప్రక్క , ముంబై వెళ్లి వార్ 2 షూటింగ్ ని చేస్తూ వస్తున్నారు. ఇటీవలే వార్ 2 సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మొదటి షెడ్యూల్ ని పూర్తీ చేసి హైదరాబాద్ తిరిగి వచ్చారు. మూడు రోజుల క్రితం రెండవ షెడ్యూల్ కోసం మళ్ళీ ముంబై వెళ్లారు. ప్రస్తుతం అక్కడే వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ అడపాదడపా సోషల్ మీడియాలో దర్శనం ఇస్తూనే ఉంటాడు.

ఎయిర్ పోర్టులోనో.. సినిమా షూటింగ్ లోనో తారక్ ని చూస్తూనే ఉంటారు. కాకపోతే ప్రతిసారి అతను చాలా ప్రశాంతంగా, నవ్వుతూ కనిపిస్తాడు. కానీ, ఈసారి వీడియోలో మాత్రం తారక్ ఆగ్రహంగా కనిపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉగ్రరూపం దాల్చాడు. అసలు అలా ఎందుకు జరిగిందా అని అంతా ప్రశ్నిస్తున్నారు. విషయం ఏంటంటే.. తారక్ ప్రస్తుతం వార్ 2 షూట్ తో బిజీగా ఉన్నాడు. హృతిక్ రోషన్ మూవీలో నటిస్తున్న ఈ హీరో తన లుక్స్ ని రివీల్ చేయకుండా ఉండాలి అనుకున్నాడు.

అందుకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాడు. బాలీవుడ్ లో ఈ పెపరాజీ ఫొటోగ్రఫీ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్లు ఎక్కడున్నా సెలబ్రిటీలను వదిలిపెట్టరు. వెంటపడి విసిగించైనా సరే పిక్స్ తీస్తుంటారు. అలాగే తారక్ ని కూడా క్యాప్చర్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. ముందుగానే తారక్ ఫొటోలు వద్దు అని చేతితో సైగ చేశాడు. కానీ, వినకుండా దగ్గరకు వెళ్లి క్లోజ్ గా షూట్ చేస్తుండటంతో.. అసహనంతో తారక్ వారిని ఓయ్ అని గట్టిగా అరిచాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లిపోయాడు.

ఈ షార్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. తారక్ అంత సీరియస్ అవ్వడం ఇప్పటివరకు చాలా మంది చూసి ఉండరు. కానీ, తారక్ డెడికేషన్ కి మాత్రం నెటిజన్స్ ఫిదా అయిపోయారు. ఎందుకంటే తన మూవీ లుక్స్ రివీల్ కాకూడదు అని అతను ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *