చాలామంది నటులు అతి చిన్న వయసులోనే గుండేపోటుతో మరణిస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో గుండెపోటుతో మరణించిన నటుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ప్రముఖ నటుడు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఇక ఆయన హఠాన్మరణం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది. అయితే సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు శరీరంలో ఉన్న ప్రధానమైన అవయవాలు అనగా.. కళ్లు, కీడ్నీలను దానర్థం చేస్తారన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే.. డేనియల్ బాలాజీ కూడా తాను మరణించినప్పుడు తన నేత్రాలను దానం చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. కాగా, ఆయన చనిపోతూ మరో ఇద్దరికి చూపును ఇవ్వలనది తన ఆశయం. అందుకు తగ్గాట్టుగానే.. ఐ రిజిస్టర్ తన పేరును నమోదు చేసుకున్నాడు. అలాగే కుటుంబ సభ్యులతో అంగీకార ధ్రువపత్రం కూడా పొందాడు. ఇక ఊహించని విధంగా సడెన్ గా బాలాజీ మరణించడంతో.. ముందుగానే ఆయన అనుకున్న కలని సహాకరం కుటుంబ సభ్యులు సహాకారం చేశారు.
కాగా, డేనియల్ బాలాజీ మరణం తర్వాత.. ఆయన కళ్లను చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రి వారు సేకరించి భద్రపరిచారు. అలాగే చూపులేని మరో ఇద్దరికి చూపును ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇక డేనియల్ బాలాజీ తన నేత్రాలను దానం చేసేందుకు సంబంధించిన ఆపరేషన్ పూర్తి అయిందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

అనంతరం ఆయన భౌతికాయన్ని తిరువాన్మియూర్లోని తన స్వగృహానికి తరలించనున్నారు. కాగా, రేపు ఆయన నివాసంలోనే అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. తాను సజీవంగా లేకపోయినా.. మరో ఇద్దరికి తన కళ్లను దానం చేసిన మంచి హృదయం డేనియల్ బాలాజీది అని ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు.