మరోసారి మ్యాజిక్ చేసేందుకు డాక్టర్ బాబు, వంటలక్క కలిసి ఈ సారి కార్తీక దీపం ఇది నవ వసంతం సీరియల్ తో రాబోతున్నారు. మొదటి సీరియల్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను ఒక్క ఆడవారినే కాదు.. మగవారిని సైతం టీవీల ముందు కూర్చొబెట్టింది కార్తీక దీపం.
అలాంటి సీరియల్ కు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. టీవీ చరిత్రలో ఏ సీరియల్ చేయని ప్రమోషన్స్ మొదలు పెట్టారు టీమ్. అయితే ప్రేమి విశ్వనాథ్ ఈ పేరు తెలుగు బుల్లితెరపై ఉన్న క్రేజ్ వేరు. కార్తీక దీపంలో తన నటనతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందిని కట్టిపడేసిన ఈ నటి స్టార్ హీరోయిన్లకు పోటీగా ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు.
చేస్తున్నది ఒకే ఒక్క సీరియల్ అయినప్పటికీ.. మిగిలిన ఏ సీరియల్ నటీనటులు ఆమెను బీట్ చేయలేకపోతున్నారు. కాగా తాజాగా ప్రేమి విశ్వానాథ్ వంటలక్క డాక్టర్ బాబుతో కలిసి డాన్స్ చేస్తూ ఉన్న ఓ ఫోటోను పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.