సీక్రెట్ గా పెళ్లి పీటలు ఎక్కనున్న బర్రెలక్క. అబ్బాయి ఎవరో తెలుసా..?

బర్రెలక్క.. సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ ఎన్నికల సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమె ట్రెండింగ్‌లో నిలిచారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి హాట్ టాపిక్‌గా మారారు. అయితే బర్రెలక్క గురించి తరచూ అనేక వార్తలు వినిపిస్తోన్నాయి. ఆమెకు బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ తో పెళ్లి అంటూ టాక్ వినిపించింది.

ఆ వార్త తెగ వైరల్ కావడంతో స్వయంగా బర్రెలక్కే స్పందించి.. అలాంటిది ఏమి లేదని తెలిపింది. అయితే తాజాగా తన పెళ్లి గురించి బర్రెలక్క ఓ వార్త చెప్పింది. తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె తెలిపారు. ఇక పెళ్లి కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలానే పెళ్లి కోసం చేసిన షాపింగ్ ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

పెళ్లి మ్యాటర్ చెప్పిన ఆమె.. కాబోయే భర్త గురించి మాత్రం రివిల్ చేయలేదు. బర్రెలక్కకు గతంలో పెళ్లి జరగ్గా..పలు కారణాలతో అతడి నుంచి విడిపోయింది. ఇప్పుడు ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుంది. గతంలో జరిగిన అనుభవాల కారణంగా కాబోయే భర్త గురించి బర్రెలక్క చెప్పడం లేదని పలువురు అభిప్రాయా పడుతున్నారు.

మొత్తంగా త్వరలో బర్రెలక్క పెళ్లిపీటల ఎక్కబోతుండటంతో ఆమె అభిమానులు సంతోష పడుతున్నారు. ఇదే సమయంలో బర్రెలక్కకు కాబోయే భర్త ఎవరా అనే ఆసక్తితో ఉన్నారు. అతడు ఎవరో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *