భారత దేశంలో ఉన్న మతాలు విశ్వాసాలపై అమెరికాకు చెందిన పీవ్ రీసర్చ్ సెంటర్ ఓ సర్వే చేసింది. 15మంది దేవతలున్న ఫోటోను చూపించి ఏ దేవుడిని పూజిస్తారు అంటూ సర్వే నిర్వహించింది.
ఆ సర్వేలో ఎక్కువమంది భోళాశంకరుడు పరమ శివుడిని పూజిస్తున్నట్లు తెలిసింది.45 శాతం మంది హిందువులు సృష్టి లయకారుడైన శివుడిని ఆరాధిస్తున్నారు. అయితే ఇక్కడ విశేషం ఏమింటే.. రాముడి కంటే ఆయన సేవకుడు హనుమంతుడికి ఎక్కువ సంఖ్యలో భక్తులు ఉన్నారు.
హనుమంతుడికి 32 శాతం మంది భక్తులు ఉండగా… రాముడిని 17 శాతం మంది భక్తులు పూజిస్తున్నారు. 2019 నుంచి 2020 మధ్య కాలంలో ఈ సర్వే కొనసాగింది. తాజాగా సర్వే ఫలితాలను విడుదల చేశారు.