శుభలేఖ సుధాకర్.. “కరోనా రోజుల్లోనే నేను హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో ‘అమ్మ’ సీరియల్ షూటింగులో ఉన్నాను. అప్పుడు చెన్నై నుంచి బాలు గారు నాకు కాల్ చేశారు. ’20 రోజులుగా అక్కడ పనిచేస్తున్నారు కదా .. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అని ఆయన అడిగారు.
‘ఎవరూ లేరండీ .. మా షూటింగు మాత్రమే జరుగుతోంది’ అని నేను చెప్పాను. ‘అన్ని జాగ్రత్తలతో పనులు జరుగుతున్నాయి .. మాకే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే .. మీకు ఇంకా జాగ్రత్తలు తీసుకుంటారు’ అని అన్నాను. “నేను అలా అనడంతో ఆయన నా మాటపై గల నమ్మకంతో అక్కడికి వచ్చారు.
నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. అక్కడ వాతావరణం బాగుందని చెప్పి ఆయన రావడానికి నేను కారకుడనయ్యాను. ఆ గిల్ట్ నేను ఈ భూమ్మీద ఉన్నంతవరకూ ఉంటుంది” అని ఆయన ఉద్వేగానికి లోనయ్యారు.