సౌందర్య తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికీ చీర కట్టులో తెలుగింటి ఆడపడుచుల ప్రతి ఒక్కరి మనసు దోచేసింది. లేడీ ఓరియంటెడ్ సినిమాల దగ్గర నుంచి గ్లామర్ పాత్రల వరకు ప్రతి పాత్రలో కూడా దర్శక నిర్మాతలకు నెంబర్ వన్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే సౌందర్య ను తన తండ్రి డాక్టర్ చేయాలని ఎంతగానో కలగన్నాడు. కానీ సౌందర్య జాతకం ప్రకారం సినీ నటి అవుతుందని ఉందట. ఇక నిజంగానే సౌందర్య సినీనటిగా మారిపోయింది.
2004లో బిజేపి పార్టీలో చేరిన సౌందర్య ఇక ఆ ప్రచార సభకు హాజరయ్యేందుకు విమానంలో వెళుతున్న సమయంలో చివరికి విమాన ప్రమాదంలో తుది శ్వాస విడిచారు అన్న విషయం తెలిసింది.సౌందర్య మరణాన్ని గుర్తు చేసుకుంటూ త్రిపురనేని చిట్టి అన్న మాటలు ఇవి, సౌందర్య తండ్రి చెప్పినట్టుగానే 12 ఏళ్ల తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య చనిపోయింది. అప్పటికి కొద్ది కాలానికి ముందే సౌందర్య వివాహం తన చిన్ననాటి స్నేహితుడు రఘుతో జరిగింది.
ఆ పెళ్లికి వెళ్లిన చిట్టి “చూశావమ్మా నాన్నగారు చెప్పినట్టుగానే జరిగింది నువ్విక సినిమాలకు దూరమై సెటిల్ అయిపోతావన్నమాట” అని అన్నారు. దానికి సౌందర్య “లేందంకుల్ మీరు అలా అంటారేంటి” నన్ను ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ గాని తమిళ ఇండస్ట్రీ గాని వదులుతుందా? నేను చచ్చేదాకా నటిస్తాను అని అన్నారట సౌందర్య. కెరియర్ పరంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న సౌందర్య 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. సౌందర్య నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సృష్టించాయి.