ఆ అమ్మాయి వల్ల రోజూ నరకం చూస్తున్నా..! పోలీసులు కూడా చేతులెత్తేసారు : సోహెల్

బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి సోహెల్.. పలు సినిమాలు చేస్తూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే బూట్ కట్ బాలరాజు సినిమాతో వచ్చాడు. ఫిబ్రవరి 2వ తేదీన ఈ చిత్రాన్ని గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఈ సినిమా చూడమంటూ సోహెల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఏడుస్తూ ఓ వీడియోలో కనిపించగా.. అది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. అనేక మంది దానిపై ఒక్కో విధంగా స్పందించారు.

అయితే సినిమా చూడండి అంటూ సోహెల్ ప్రేక్షకులను వేడుకున్నా కూడా కంటెంట్ అంత ఇంట్రెస్టింగ్ గా లేకపోవడంతో ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఇదిలా ఉంటే సోహెల్ ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలిపాడు. తనకు కొంతమంది అమ్మాయిలు టార్చర్ చూపిస్తున్నారని అంటున్నాడు సోహెల్. తనకు ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అంటున్నాడు సోహెల్. ఒక అమ్మాయి రోజు ఫోన్ చేసి టార్చర్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తే గలీజ్ గా మాట్లాడుతుంది.

దాదాపు 11 మంది అమ్మాయిలు తనకు రోజూ ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నారని.. అందుకే టార్చర్ 1, టార్చర్ 2 అని నెంబర్స్ సేవ్ చేసుకున్నా అని తెలిపాడు సోహెల్. ఒకమ్మాయి రోజూ ఇంటికి కూడా వస్తుంది. చాలా దారుణంగా మాట్లాడుతుంది. మా అమ్మ ఆమెకు వార్నింగ్ కూడా ఇచ్చింది అని తెలిపాడు. లాభం లేదని అరియనతో కలిసి ఆ అమ్మాయి పై పోలీసులకు ఫిర్యాదు చేద్దాం అని వెళ్తే నాకే రిస్క్ అవుతుందని అన్నారు దాంతో షాక్ అయ్యా..

అదే ఒక అమ్మాయి ఇంటికి ఓ అబ్బాయి వెళ్లి ఇలా చేస్తే పోలీసులు ఊరుకుంటారా..? అబ్బాయిలకు ఓ న్యాయం. అమ్మాయిలకు ఓ న్యాయమా.? ఇవన్నీ చూస్తుంటే అబ్బాయిల కోసం ఓ సంఘాన్ని క్రియేట్ చేసి దానికి లీడర్ గా ఉంటా.. అమ్మాయిల చేతిలో మోసపోయిన వారికి అండగా ఉంటా అంటూ చెప్పుకొచ్చాడు సోహెల్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *