దివ్యాంక ఈ ముద్దుగుమ్మ టీవీ ఇండస్రీలో బీభత్సమైన స్టార్డమ్ తెచ్చుకుంది. ఈ పేరు, గుర్తింపు ఆమె దృఢత్వానికి, సంకల్పానికి నిదర్శనం. ఆమె ప్రయాణం పూలపాన్పు కాదు. జీవితంలో ఆమెకు ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. వాటన్నిటినీ తట్టుకొని ధైర్యంగా ముందుకు సాగుతూ నేడు హైయ్యెస్ట్ పెయిడ్ టీవీ యాక్ట్రెసెస్లో ఒకరిగా ఎదిగింది. అయితే దివ్యాంక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జీవితంలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నానని చెప్పింది. ఒక షో ముగిశాక ఆర్థిక వ్యవహారాలు మేనేజ్ చేసుకోవడంలో చాలా కష్టాలను ఫేస్ చేశానని తెలిపింది.
ఒక ప్రాజెక్ట్ ముగియడం అంటే ఉపాధి కోసం కొత్త పోరాటం మొదలయ్యిందని అర్థం అన్నట్లు ఆమె మాట్లాడింది. ఆ సమయంలో బిల్లులు, EMIల వంటి ఖర్చులను చెల్లించడానికి డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడిందట. ఈ కష్టాల సమయంలో డబ్బు కోసం ఏ పనినైనా అంగీకరించడానికి సిద్ధంగా ఉండేదట. బతకడం కోసం ఎంత చిన్న పని అయినా, ఏ పాత్రకైనా తనను తాను సిద్ధం చేసుకున్నానని దివ్యాంక వివరించింది. రూ.2,000, లేదంటే రూ.5,000 ఇలా చిన్నపాటి డబ్బులు వచ్చే పనిచేయడానికైనా ఒప్పుకునేదాన్ని అని ఆమె చెప్పుకొచ్చింది.

చివరికి ఖాళీ టూత్‌పేస్ట్ బాక్సులను కూడా ఏరుకున్నానని చెప్పింది. ఇలాంటి చెత్తను సేకరించి వాటిని అమ్మడం ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని సేవ్ చేశానని వెల్లడించింది. ఒకానొక సమయంలో ఈ చెత్తను అమ్మడమే జీవనాధారం అయ్యిందని తెలిపింది. పెంపుడు కుక్కకు ఆహారంతో సహా నెలవారీ అవసరాలను కవర్ చేయడానికి ఆదాయాన్ని పొందడం ఆమెకు ఒక పెద్ద ఆందోళనగా ఉండేదట. పొదుపు చేసే అలవాటు ఉండటం వల్ల అనేక కష్ట సమయాల నుంచి బయటపడ్డానని దివ్యాంక వెల్లడించింది.
ఎల్లప్పుడూ కొంత డబ్బును పక్కన పెట్టమని ఒకరు సలహా ఇచ్చారని చెప్పింది. సంపాదనతో చిన్న బంగారు నాణేలను కొనుగోలు చేసి వాటితోనే రోజువారీ ఖర్చులు, EMIs కవర్ చేశానని పేర్కొంది. అలా ఈ తార ముందుకు సాగుతూ చివరికి రొమాంటిక్ డ్రామా సిరీస్ “యే హై మొహబ్బతేన్ (2013–2019)“తో భారీ సక్సెస్ అందుకుంది. దీనితో స్టార్ యాక్ట్రెస్‌గా అవతరించి ఎక్కువగా రెమ్యునరేషన్ పొందడం ప్రారంభించింది.