కుర్చీతాతకు క్యాన్సర్, పరిస్థితి విషమంగా ఉండడంతో.. వైద్యులు కూడా..?

ఇప్పటికే ఎవరినోట విన్నా.. ‘కుర్చీ మడతపెట్టి దె*** అనే ఈ పరమ దరిద్రపు గొట్టు బూతు వైరల్ అవుతుంది. ఆ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉండే.. కుర్చీతాత పాపులర్ డైలాగ్‌ని ఇన్ స్టా రీల్స్‌లో.. యూట్యూబ్‌లో.. ఫేస్ బుక్‌లో రకరకాలుగా వాడేశారు. అయితే అక్కడక్కడా విన్న వాటిని కాస్త అటూ ఇటూ మార్చి.. వాడకంలో వీరుడు.. సూరుడు.. ధీరుడుగా పేరున్న థమన్ మన కుర్చీతాతను కూడా వాడేశాడు. అయితే ‘ ఆ కుర్చీ మడత పెట్టి’ అనే డైలాగ్‍ ఓ బిక్షాటన చేసే వ్యక్తిని సెలబ్రిటీ హోదాకు తీసుకు వచ్చింది.

అతడే షేక్ పాషా కాస్త.. కుర్చీతాతగా మారిపోయాడు. అతడిని మరింత ఫేమస్ చేసేశాయి యూట్యూబ్ ఛానల్స్. దీంతో కుర్చీతాతకు ఎక్కడ లేని పబ్లిసిటీ వచ్చింది. ఇదే డైలాగ్‌ను మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం మూవీలో వినియోగించారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ఈ పాట సినిమాకు ఎస్సెట్ అయిన సంగతి విదితమే. అతడికి చిత్ర యూనిట్ రూ. లక్ష రూపాయలు రెమ్యునరేషన్ కూడా ఇచ్చింది. ఇటీవల తోటి యూట్యూబర్లను తిట్టిన కేసులో జైలు పాలైన కుర్చీతాత.. కొన్ని రోజులుగా కనిపించడం లేదు.

ఆ తర్వాత ఏం అయ్యారో కూడా తెలియదు. అయితే ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఆయనకు ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుర్చీతాతను ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. గాంధీ ఆసుపత్రి వైద్యులు ఆయనకు పరీక్షించగా.. క్యాన్సర్ అని నిర్థారణ అయ్యింది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు నిర్దారించారు. కాగా, ఆయన ఆల్కహాలిక్ కూడా కావడంతో ఈ వ్యాధి బారిన పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *