జ్యోతిషశాస్త్రం కలను వేరే విధంగా వివరిస్తుంది. జ్యోతిష్య పుస్తకాల ప్రకారం, రాత్రి నిద్రిస్తున్నప్పుడు వచ్చే కలలు భవిష్యత్ సంఘటనలను సూచిస్తాయి. ఈ మత్స్య పురాణంలో కలల గురించి కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి. జీవితంలో కలలను అలవర్చుకోవడం ద్వారా ఆ కలను నిజం చేసుకోవచ్చు. కానీ కలలు సాకారం కావాలంటే ఈ నియమాలను పాటించాలి. స్వప్న శాస్త్రం కూడా జ్యోతిష్యంలో ఒక భాగం. అయితే కల అనేది మంచి కలయినా కావచ్చు.. లేదా పీడకలైన కావచ్చు.. కలలో కనిపించిన వ్యక్తులు వస్తువులు ప్రదేశం సమయం బట్టి ఆ కల యొక్క ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది.
కలలు వాటి ఫలితాల గురించి స్వప్న శాస్త్రంలో విపులంగా చెప్పబడింది. మిగతా సమయాల్లో వచ్చే కలలు కన్నా బ్రహ్మ ముహూర్తంలో అనగా తెల్లవారుజాము మూడు గంటల నుండి 5 గంటల 30 నిమిషాల మధ్యలో వచ్చే కలలు ఎక్కువగా నిజమవుతాయట. ఈ సమయంలో విశ్వశక్తి భూమి మీద ఎక్కువగా ప్రవహిస్తుంది. భగవంతుడు మనతో ఏమైనా చెప్పాలనుకుంటే ఈ సమయంలోనే మనకి కల రూపంలో వచ్చి చెబుతాడట. ఒక్కసారి మన కలలో మనం కానీ లేదా మనకు కావలసినవారు కానీ చనిపోయినట్లు కనిపిస్తుంది.
దీంతో ఏదో ఆపద జరగబోతుందని ఇలా వచ్చిన కలవల్ల సానుకూల ఫలతమే వస్తుందని స్వప్న శాస్త్రంలో చెప్పబడింది. ఎవరైతే మరణించినట్లు కల వచ్చిందో వారికి సంభవించిన కీడు మొత్తం ఈ కల ద్వారా పోయి వారు ఇకనుండి సుఖంగా ఉండబోతున్నారని అర్థమట. ఒకరకంగా ఇది వారికి పునర్జన్మ ఎత్తినట్లేనట. అలాగే కలలో రక్తం లేదా నూరి తాగుతున్నట్లు.. స్వీట్స్ తింటున్నట్లు.. గుండు గీయించుకుంటున్నట్లు కనిపిస్తే మీరు త్వరలో మరణ వార్త వింటారట. కలలో పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మీకు పెద్ద సమస్యలు ఎదురవుతున్నారు.