ఎన్నికల వేళ సీఎం జగన్ – చంద్రబాబు మధ్య సవాళ్ల పర్వం కొనసగుతోంది. తాజాగా వాలంటీర్ల సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల పైన చంద్రబాబు స్పందించారు. రాబోయే ఎన్నికలకు వైసీపీ నేతలు, కార్యకర్తలు చొక్కాలు మడతపెట్టే సమయం వచ్చిందని సీఎం జగన్ అంటున్నారని..వాళ్లు చొక్కాలు మడతపెడితే..
టీడీపీ కార్యకర్తలు, జనసైనికులు కుర్చీలు మడతపెడతారు. అందరం కుర్చీలు మడతపెడితే జగన్‌రెడ్డికి కుర్చీ లేకుండా పోతుందని హెచ్చరించారు. ఎన్నికలంటే చొక్కాలు, కుర్చీలు మడతపెట్టి కొట్టుకోవడం కాదని, ద్వంద్వయుద్ధమని హితవు పలికారు.
ఈ ప్రభుత్వంలో అందరూ బాధితులేనని వివరించారు. రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ దెబ్బతింటే.. దానిని మళ్లీ సంపాదించుకోవడం చాలా కష్టమని చంద్రబాబు చెప్పుకొచ్చారు.