ములుగు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సీతక్క గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన ఆమె.. అనేక కష్టాలు, సమస్యలు ఎదుర్కొన్నారు. అలానే ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో ఆమె ఎప్పుడు ముందుటారు.
కరోనా సమయంలో అడవుల్లో ఉండే గిరిజన ప్రజల కోసం, మాముల ప్రాంతాల్లో ఉండే వారి కోసం సీతక్కే స్వయంగా వెళ్లి ఆహారం పదార్ధాలను అందించారు. అంతేకాక సామాన్య ప్రజలతో అతి సామాన్యురాలిగా కలిసిపోతారు. పార్టీలతో సంబంధం లేకుండా సమస్య అంటూ తన వద్దకు వచ్చిన వారిని సీతక్క ఆదరిస్తారు.
అలానే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రజా సమస్యలపై సీతక్క గళం విప్పారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ తరపున ములుగు నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలానే రేవంత్ రెడ్డి కేబినెట్ లో గిరిజన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.