కొల్లాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర్య అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగి ఈల గుర్తుపై పోటీ చేస్తున్న బర్రెలక్కకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. కనీసం ప్రచారం చేసుకోవటానికి కూడా డబ్బులు లేని ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న బర్రెలక్క కోసం మేము సైతం అంటూ దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి,
విదేశాల నుండి కూడా పలువురు మద్దతు ఇస్తున్నారు. డిగ్రీ చదివి ఉద్యోగం రాలేదని అందుకే గేదెలు కాస్తూ బ్రతుకుతున్నాను అంటూ గతంలో ఒక వీడియో చేసిన బర్రెలక్క ఇప్పుడు దేశ వ్యాప్తంగా తెలిసిన మనిషిగా మారారు. రాష్ట్రంలో అనేక జిల్లాల నుండి బర్రెలక్క ఎన్నికల ఖర్చులకు నిధుల వరద కురిసింది.
ఎవరికి వారు అక్కడికి వెళ్లి మరీ ఆమెకు తమ వంతు సాయం చేసి మద్దతును ప్రకటించి మరీ వచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న బర్రెలక్కకు తాజాగా ప్రజల మద్దతు లభించింది.