తల్లితో కలిసి అమృత ప్రణయ్ సంచలన నిర్ణయం..! షాక్ లో అత్త, మామలు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్ 14వ తేదీన జరిగిన ప్రణయ్ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మిర్యాలగూడకు రియల్ వ్యాపారి మారుతీ రావు కూతురు అమృత, ఇదే పట్టణానికి చెందిన దళితుడు ప్రణయ్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కులాంతర వివాహాన్ని అంగీకరించని మారుతీ రావు.. ప్రణయ్ ను హత్య చేయించాడని అమృత తండ్రిపై కేసు పెట్టింది. అయితే జీవితంలో ప్రతి కష్టన్ని దాటుకుని ముందుకు వెళ్లగలిగే సత్తాను, ధైర్యాన్ని కాలమే ఇస్తుందంటారు. ఇది నిజంగా అమృత జీవితానికి వాస్తవంగా, దగ్గరగా ఉంటుంది.

తన జీవితంలో జరిగిన విషాధ ఘటనను దిగమింగుకొని, తన కొడుకును చూసుకుంటూ లైఫ్ లో ముందుకు సాగుతుంది. ఇదిలా ఉంటే.. గత కొన్నేళ్లుగా అమృత తన తల్లితో విబేధాలను విడిచి కలిసిపోయిన సంగతీ తెలిసిందే. అయితే తాజాగా తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా అమృత తల్లి, కొడుకు నిహాన్ హైదరాబాద్ కు తరలి వచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను అమృత తన యుట్యూబ్ చానెల్ షేర్ చేసింది. ఆ వీడియోలో తన తల్లిని రాగానే పలకరిస్తూ.. వీడియోను తీస్తుంది. అలాగే తన తల్లిని ఎప్పుడు బయలుదేరారు అని అడుగుతూ.. పలు విషయాలను ఇద్దరు చర్చించుకుంటారు.

ఆ తర్వాత నిద్రపోతున్నా తన కొడుకు నిహాన్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇక కొడుకు నిద్ర లేవడంతో.. ఈ వీడియోను కొనసాగించాలని ఉన్నా, తన కొడుకును చూసి దాదాపు వారం రోజులు అయ్యింది. అందుకే వీడియో తీయాలని లేదు వాడితో ఆడుకొని, సరదాగా గడపాలని ఉందని చెప్తు.. వీడియోను ముగించింది. ప్రస్తుతం ఈ వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన ప్రతిఒక్కరు అమృత తన లైఫ్ లో ఇలానే తన కొడుకుతో సంతోషం ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి, ఎంతో ఆనందంగా తన తల్లితో, కొడుకుతో కనిపిస్తున్న అమృత పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *