తాజాగా ఈ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో హీరోయిన్ రష్మిక దర్శనం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు రామ్ గోపాల్ వర్మ..తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే..రామ్ గోపాల్ వర్మ పక్కన ఉన్నది హీరోయిన్ రష్మిక కాదు. అమె ఎవరో కానీ.. అచ్చం హీరోయిన్ రష్మిక లాగే ఉంది.
సడెన్ గా చూస్తే.. అందరూ హీరోయిన్ రష్మిక అనే అనుకుంటారు. ఇప్పుడు వీరిద్దరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అయితే వ్యూహం సినిమా గతేడాది డిసెంబర్ 29న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కావాల్సింది. కానీ, పలు కారణాల వల్ల వ్యూహం రిలీజ్ డేట్‌పై కోర్టులో కేసు ఫైల్ అయింది.

పలు వాయిదాల అనంతరం వ్యూహం విడుదలకు కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రామ్ గోపాల్ వర్మ ఫుల్ ఖుషీలో ఉన్నాడు. వ్యూహం మూవీకి క్లియరెన్స్ వచ్చిందన్న ఆనందంలో పబ్‌లో రాత్రంతా ఎంజాయ్ చేశాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.