తన చుట్టూ ప్రత్యర్థులు రాజకీయ పద్మవ్యూహం పన్నారని వెన్నుపోట్లు.. ఎత్తులు పన్నుతున్నారని అయితే వారి వ్యూహం లో చిక్కి బాణాలకు బలై పోవడానికి తాను అభిమన్యుడిని కాదనీ అర్జునుడిని అంటూ సీఎం జగన్ సభ వేదిక గా తేల్చారు.
నిజానికి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నాటి నుండి ఎక్స్ ప్రెస్ స్పీడ్ లో తన అన్న జగన్ ను టార్గెట్ చేసుకుంటూ YS షర్మిల దూసుకు పోతున్నారు. ఇచ్ఛాపురం మొదలుపెట్టి ఇడుపులపాయ వరకూ సాగే ఆమె యాత్ర లో ప్రధానంగా తన తండ్రి YSR అందించిన పాలన కొనసాగించడం లో అన్న జగన్ ఫెయిల్ అయ్యారంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
కేవలం విమర్శల వరకూ మాత్రమే కాదు గేట్లు కొట్టుకుపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు, గంతలు పడ్డ గుంటూరు రోడ్లు వంటి వైసీపీ పాలనకు ఇబ్బంది కరంగా మారిన చోట్ల కు స్వయంగా వెళ్లి మరీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు.