నటి జ్యోతి రాయ్. తెలుగులో ఆమె ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తోంది. ఈ సిరియాలో హీరోకి తల్లిగా జగతి పాత్రలో జ్యోతి రాయ్ నటిస్తున్నారు. ఎన్నో టివి సీరియల్స్ చేసిన జ్యోతి రాయ్ ప్రస్తుతం ఆమె తన వ్యక్తిగత వ్యవహారాలతో వార్తల్లో నిలిచారు. అయితే బుల్లితెర భామ జ్యోతిరాయ్ ఓ యువ దర్శకుడితో రిలేషన్లో ఉందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా ఇటీవల ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలు చూస్తే వీరి బంధం నిజమేనని తెలుస్తోంది.
గతంలో శుక్ర, మాటరాని మౌనమిది లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సుకు పుర్వాజ్‌తో రిలేషన్లో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రాలు రెండూ ఓటీటీ వేదికగా అలరిస్తున్నాయి. ప్రస్తుతం ఏ మాస్టర్ పీస్ అనే చిత్రాన్ని సుకు తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరూ సన్నిహితంగా ఉంటూ ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేయడంపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అంతే కాకుండా వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నట్లు సీరియల్ నటి సుజాత పెట్టిన కామెంట్ చూస్తే తెలిసిపోతుంది. సుజాత ‘లవ్ లవ్ అండ్ లవ్ యూ బోత్.. కీప్ రాకింగ్ ఆల్వేస్’ అంటూ కామెంట్ పెట్టగా.. ‘థాంక్యూ డియర్’ అంటూ జ్యోతిరాయ్ కూడా రిప్లై ఇచ్చింది.

కాగా.. జ్యోతిరాయ్‌కి 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో పెళ్లి కాగా.. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. జ్యోతిరాయ్ నటి కావడానికి కూడా అతనే కారణమని కన్నడ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. దీంతో జ్యోతిరాయ్.. దర్శకుడు సుకు పుర్వాజ్ అలియాస్ సురేశ్ కుమార్‌తో రిలేషన్లో ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. సీరియల్స్‌తో పాటు కన్నడలో పలు చిత్రాల్లో నటించింది. రాయ్ దియా, గంధాడ గుడి లాంటి వెబ్ సిరీస్‌లలో కనిపించింది జ్యోతి రాయ్.
