జగన్ పై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. వైసీపీలోని జగన్ సైన్యం తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుందని ఆరోపించారు. రోజుకొక జోకర్ తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. మహిళ అని కూడా చూడకుండా చాలా దిగజారి మాట్లాడుతున్నారని షర్మిల ఫైర్ అయ్యారు. అయితే సాక్షిలో తనకు సమాన వాటా ఉందని అన్నారు. తాను ఏపీ కి రావాల్సిన ఫలాల గురించి పోట్లాడుతున్నానని, స్పెషల్ స్టేటస్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నాని అన్నారు.
పోలవరం ఎందుకు పూర్తికాలేదు.. బీజేపీకి మీరు బానిసలాగా ఎందుకున్నారు..?.. రాజధాని గురించి, బిడ్డలకు ఉద్యోగాలు, రైతులకు క్రాప్ ఇన్సురెన్స్ గురించి ప్రశ్నిస్తుంటే.. మీరు మాత్రం సోషల్ మీడియాలో అడ్డదిడ్డమైన దూషణలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విలువలు, విశ్వసనీయత గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వైఎస్సార్సీ పీ ఇప్పుడు ఇంతలా దిగజారాలా అని ఎద్దెవా చేశారు.
తాను రాజశేఖర్ బిడ్డనని, తన ఒంట్లో రాజశేఖరుడి రక్తం ప్రవహిస్తుందని షర్మిల అన్నారు. ఎవరు అరిచి అడ్డదిడ్డమైన ఆరోపణలు చేసి ఆంధ్ర ప్రదేశ్ కోసం ఎంత వరకైన కోట్లాడటానికి తాను సిద్ధమని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.