చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు, దీంతో చిరంజీవికి అవన్నీ ఫ్రీగా ఇస్తారా..?

పద్మవిభూషణ్ – ఇది అసాధారణమైన విశిష్ట సేవ చేసిన వారికి ఇస్తారు.పద్మభూషణ్- అత్యంత విశిష్ట సేవలకు ఇస్తారు.పద్మశ్రీ-ఈ అవార్డును విశిష్ట సేవలు చేసిన వారికి ప్రదానం చేస్తారు. పద్మ అవార్డులను ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వరు, కానీ వారి వ్యక్తిగత పద్మశ్రీ అవార్డు ఇవ్వవచ్చు. పద్మ అవార్డు పొందిన వ్యక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి? నగదు ప్రోత్సాహకం ఉంటుందా? ఇలాంటి డౌట్స్ చాలా మందిలో ఉంటాయి. వాస్తవానికి పద్మ అవార్డు ఒక గౌరవం మాత్రమే. ఈ అవార్డు వచ్చిన వారికి ఎలాంటి నగదు, రాయితీ ఇవ్వరు.

అయితే కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించింది. దేశంలోనే అత్యున్న రెండో పురస్కారం అయిన పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. కళా రంగంలో అందించిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ సత్కారం ప్రకటించింది. చిరూ తో పాటుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కూడా ఈ అవార్డు వరించింది. పద్మ అవార్డులు అనేవి ఓ గౌరవంగా మాత్రమే మనం గుర్తించాలి. పద్మ అవార్డులు వచ్చిన వ్యక్తులకు ఎలాంటి నగదు కానీ, రాయితీలు కానీ ఇవ్వరు. రైలు, విమాన ప్రయాణాల్లో కూడా ఎలాంటి రాయితీలు, ఉచితాలు ఉండవు.

అయితే పద్మ అవార్డులు అందుకున్న ప్రముఖులు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంటుంది. ఇక ఈ అవార్డులు పొందిన వారికి రాష్ట్రపతి సంతకంతో ఉన్న ధృవీకరణ పత్రం, మెడల్ బహూకరిస్తారు. ఇదిలా ఉండగా.. సినీ రంగానికి చేసిన సేవలకుగానూ మెగాస్టార్ కు 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డును ప్రధానం చేసింది. ఇక ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. కాగా.. మెగాస్టార్ 2006 సంవత్సరంలోనే సౌత్ ఫర్ హానరరీ యాక్టింగ్ కెరీర్ పేరిట ప్రత్యేక అవార్డును ఫిల్మ్ ఫేర్ వేడుకల్లో అందుకున్నాడు. వీటితో పాటుగో ఎన్నో పురస్కారాలను దక్కించుకున్నాడు మన మెగాస్టార్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *