దేశ రాజధాని డిల్లీ, ఆగ్రాలో పాల పిట్టను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో రామ భక్తులు చంబల్ వన్యప్రాణుల అభయారణ్యం వద్దకు చేరుకున్నారు. ఈ పాల పిట్టను చూసి రాముడు రావణుడి లంకను జయించాడని నమ్ముతారు. అందుకనే అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పురష్కరించుకుని పాల పిట్ట దర్శనం కోసం పోటెత్తారు.
ఈ నేపధ్యంలో పర్యావరణవేత్త, వన్యప్రాణుల ప్రేమికుడు దేవాశిష్ భట్టాచార్య మాట్లాడుతూ చంబల్లో పాల పిట్టల పక్షుల సంఖ్య గతం కంటే సుమారు 4 శాతం పెరిగిందన్నారు. హిందూ సనాతన ధర్మంలో జంతువులకు, పక్షులకు, చెట్లకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది. ఏదైనా శుభకార్యాలు జరిపే సమయంలో జమ్మి వంటి చెట్లను పూజించడమే కాదు..అందమైన పాల పిట్ట దర్శనానికి కూడా ఎంతో ప్రాశస్త్యం. దసరా రోజున పాల పిట్ట దర్శనం అత్యంత ఫలవంతం అనే నమ్మకం అంది.
రావణాసురడితో యుద్ధం చేయడానికి శ్రీరాముడు బయలుదేరి వెళ్లే సమయంలో దశమి రోజునే పాలపిట్ట ఎదురు వస్తుంది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధించి.. సీతమ్మను రావణ చెరనుంచి తీసుకువస్తాడు. ఆ తర్వాత ఆయోధ్యకు రాజుగా మారుతాడు. పాలపిట్టను విజయానికి సూచికగా భావించడానికి ఇదొక కారణమని సామాజిక కార్యకర్త విజయ్ ఉపాధ్యాయ్ కూడా జోడించారు.