పెళ్లి డప్పు కొట్టిన రోజా, వచ్చినట్టే ఉగిపొయి కొట్టింది రోజా.

మహిళలకు ముగ్గుల పోటీలు జరగ్గా సంబరాలు నిర్వహించిన రోజా సరదా సరదాగా గడిపారు. సంబరాల్లో పాల్గొన్న ఆర్కే రోజా భర్త సెల్వమణి తో కలిసి ఎడ్ల బండి పై సరదాగా స్వారీ చేసారు. స్వయంగా కోడి ని పట్టుకుని ఢీ అంటే ఢీ అంటూ కోడిపందాలాడిన రోజా చిలక జోస్యం కూడా చెప్పించుకున్నారు.

భర్త ను కుర్చీలో కూర్చోపెట్టి తమ అదృష్టం ఎలా ఉందో చిలక జోస్యం చెప్పించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నగిరి డిగ్రీ కాలేజీ మైదానంలో నియోజకవర్గం లోని మహిళలందరికీ పోటీలు ఆటలు పోటీలు నిర్వహించిన రోజా బహుమతులు అందజేసారు. సంక్రాంతి ఆటలు పాటలతో పొంగళ్ళు పెట్టి సందడి చేశారు.

నగరి నియోజకవర్గంలోని మహిళలందరితో కలిసి సంతోషంగా సంక్రాంతి జరుపుకోవాలని ముగ్గుల పోటీలు నిర్వహించి వారి ప్రతిభను గుర్తించేందుకు ఏటా సంబరాలు జరుపుతున్నామన్నారు మంత్రి రోజా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *