సోగ్గాడు మళ్లీ పుట్టాడా ? ఆరు అడుగుల కటౌట్ తో శోభన్ బాబు వారసుడు, వీడియోస్ వైరల్.

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో.. ఆంధ్రుల అందగాడు..తెలుగు ప్రేక్షకుల సోగ్గాడు దివంగత హీరో శోభన్ బాబుకు సంబంధించిన ఏఐ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఆర్టిఫీషియల్ టెక్నాలజీ సాయంతో ఈ వీడియోను రూపొందించినట్లుగా చూస్తుంటే అర్థమవుతుంది. సముద్రం ఒడ్డున శోభన్ బాబు చాలా స్టైలీష్‏గా.. రాయల్ గా నడుస్తూ వస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందులో శోభన్ బాబు కటౌట్ హాలీవుడ్ రేంజ్‏లో కనిపిస్తుండగా.. ఏఐ టెక్నాలజీ సాయంతో శోభన్ బాబు ముఖాన్ని క్రియేట్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. సోగ్గాడు మళ్లీ ఇన్ స్టా యుగంలో జన్మిస్తే ఇలా ఉంటాడేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. శోభన్ బాబుకు తెలుగులో ఒకప్పుడు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు. చివరి వరకు హీరోగానే నటించి అలరించారు. నటిస్తే హీరో పాత్రలే నటిస్తానని.. ఇతర పాత్రలు ససేమిరా చేయనని.. ప్రేక్షకులు ఎప్పటికీ తనను హీరోగానే గుర్తుంచుకోవాలని అన్నారట.

అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరో శోభన్ బాబు. తెలుగు తెరపై ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు శోభన్ బాబు. అందుకే ఆయనను తెలుగు రాష్ట్రాల ప్రజలు నటభూషణ, సోగ్గాడు, ఆంధ్రా అందగాడు అని పిలుచుకుంటారు. 2008 మార్చి 20న చెన్నైలోని తన నివాసంలో మరణించారు శోభన్ బాబు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *