కోపంతో ఊగిపోయిన దిల్ రాజు, ఎవరు చెప్పార్రా అంటూ..?

కొందరు హీరోలకు సంక్రాంతి ఓ సెంటిమెంట్ కూడా. అదే సమయంలో, సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలకే థియేటర్లు దొరుకుతాయని, చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోందని ఎప్పటినుంచో విమర్శలు ఉన్నాయి. అయితే గత కొన్నేళ్లుగా తనను టార్గెట్ చేసుకొని కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ ఉద్దేశపూర్వకంగానే బురద జల్లుతున్నారని, ఇకపై అలా చేస్తే ఊరుకునేది లేదని ఎమోషనల్ అవుతూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఈ విధంగా ఆయన మాట్లాడడంతో అందరూ షాక్ అయిపోయారు.

అందరితో కలిసి పోయి నవ్వుతూ మాట్లాడే దిల్ రాజు అంతటి కోపాన్ని మీడియా ముందు చూపించడంతో అందరూ షాక్ అయిపోయి నవ్వుతూ ఉండే దిల్రాజ్ ఇంత కోపం ఏంట్రా బాబు అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రతి సంక్రాంతికి దిల్ రాజునే ఏదో తప్పు చేసినట్టు ప్రోజెక్టు చేయడం సరికాదని, ఇండస్ట్రీలో నేను 95 శాతం మందికి నచ్చాను కాబట్టే ప్రస్తుతం ఈ పొజిషన్ లో గౌరవంతో బతుకుతున్నానని అది నాకు ఎంతో తృప్తిని ఇచ్చిందని అన్నారు.

హనుమాన్ చిత్రాన్ని నేనేదో ఆపుతున్నట్లు ట్రోల్ చేయడం మంచిది కాదని, నా సామిరంగా, శైందవ్ వంటి చిత్రాలకు కొన్ని చోట్ల థియేటర్లు కూడా దొరకలేదని , ఈ విషయాన్ని ఎవరూ కూడా ప్రశ్నించలేదని అన్నారు. ఈ విధంగా దిల్ రాజ్ అలా మాట్లాడడంతో అన్న కోపం ఎప్పుడూ చూడలేదని ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *