మూడు రోజుల్లో రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ మంచులా కరిగిపోతుంది.

విపరీతంగా నూనె వాడకం, వేపుడు పదార్థాలను తినడం, కూల్ డ్రింక్స్, వల్ల చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పెరిగిపోతుందని, ఫలితంగా ఒబేసిటీ బారినపడి అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ పెరగటం వల్ల ఊబకాయం వస్తుంది, ఫలితంగా టైప్ 2 డయాబెటిస్, హై బీపీ, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి అనేక ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. కండరాల నొప్పులు, రక్తంలో కొలెస్ట్రాల్ పెరగటం, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.

ముఖ్యంగా బరువు తగ్గించే బొప్పాయి, జామ, ఆపిల్, స్ట్రాబెరీ, ఆరెంజ్, అవకాడో వంటి పండ్లను తీసుకోవడం వల్ల పండ్లు చెడు కొలెస్ట్రాల్ ను పెరగకుండా నియంత్రిస్తాయి. మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా పండ్లు ఎంతగానో దోహదం చేస్తాయి. పండ్లలో పుష్కలంగా ఉండే విటమిన్లు, మినరల్స్ మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. బరువు తగ్గాలి, శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకోవాలి అని భావించే వారు కార్బోహైడ్రేట్లను ఆహారంలో తక్కువగా తీసుకోవాలి.

అంతేకాదు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నవారు ఓట్స్ ను ఆహారంలో భాగంగా చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గటమే కాకుండా, బరువు తగ్గడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓట్స్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల 25 నుండి 35 గ్రాముల ఫైబర్ శరీరానికి అందుతుంది. కొవ్వు కరిగించడానికి ఓట్స్ ఎంతగానో దోహదం చేస్తుంది. అందుకే ఓట్స్ ను క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే మెరుగైన ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *