పుట్టుమచ్చలను బట్టే కొందరి జీవితాలు మారిపోతాయి. స్త్రీల విషయంలో ఈ పుట్టుమచ్చల ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఉండే పుట్టుమచ్చల ప్రభావం పురుషులపై కూడా బాగానే ఉంటుంది. అయితే ఎర్రని మచ్చలు వల్ల ఎల్లప్పుడూ శుభ ఫలితాలే కలుగుతాయి. స్త్రీకి చేతుల మీద కానీ లేదా నుదిటిపై ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఉంటే వీరికి పుత్రసంతానం కలుగుతుంది. నుదిటి యొక్క కుడి భాగంలో పుట్టుమచ్చ ఉంటే వీరి భర్త సంపాదనను కలిగి ఉంటారు.అలాగే నుదిటి ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటే వీరికి సాధారణ ఫలితాలు కలుగుతాయి.
ఏ స్త్రీకి ఎడమ కడత పై పుట్టుమచ్చ ఉంటుందో వారు మంచి ప్రవర్తన నడవడికలను కలిగి ఉంటారు. కుడి వైపు పుట్టుమచ్చ ఉంటే వీరు భర్త మాటకు గౌరవించి భర్త అడుగు జాడల్లోనే నడుచుకుంటారు. ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీ అనుకున్న పనులలో పట్టుదల, ఆసక్తిని కనబరుస్తారు అలాగే ముక్కు చివరన ఎర్రని పుట్టుమచ్చ ఉంటే అలాంటి స్త్రీలు ధనవంతులై సకల సంతోషాలతో కలిగి ఉంటారు. వీరికి కలిగిన సంతానం అభివృద్ధి బాటలో నడుస్తూ కీర్తి ప్రతిష్టలు పొందుతారు.
స్త్రీలకు కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉంటే వీరికి ధిక్కార స్వభావం కలిగి ఉంటారు. బంధుమిత్రులతో అనవసరమైన తగాదాలను పెట్టుకుంటారు. అలాగే స్త్రీలకు ఎడమ భుజం మీద పుట్టుమచ్చ ఉంటే వారికి చేతి నిండా ధనం కలిగి ఉంటారు మనసులో పరిమితమైన కోరికలను కలిగి ఉంటారు. అయితే పుట్టుమచ్చ కుడి మోచేతి మీద ఉంటే మొదట్లో కష్టాలు ఉన్నా ధైర్యంగా నిలబడే స్వభావం కలిగి ఉండటం వల్ల వీరు సుఖాలను అనుభవించగలరు.
తమను తాము రక్షించుకోగలరు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్త్రీల చేతులపై దోమ ఆకారంలో పుట్టుమచ్చ ఉంటే వీరికి పుత్ర సంతానం కలుగుతుంది. సంగీత సాహిత్యాలలో ప్రావీణ్యం కలిగి ఉంటారు.అలాగే అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే అనేక విద్యలలో ప్రావీణ్యం కలిగి ఉంటారు.