సినిమా సెలబ్రిటీలను, రాజకీయ ప్రముఖులను అస్సలు వదలదు శ్రీరెడ్డి. సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్ చల్ చేస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తన వీడియోలే. ఆ వీడియోలను చూసి నెటిజన్లే షాక్ అవుతుంటారు.వైసీపీ వీరాభిమాని అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
టీడీపీ నేతలను తిట్టడం, వైసీపీ వాళ్లకు సపోర్ట్ చేయడం, సినిమా సెలబ్రిటీలను తిట్టడం.. బండ బూతులతో రెచ్చిపోవడం శ్రీరెడ్డికే చెల్లుతోంది. ఇవన్నీ పక్కన పెడితే అందాల ఆరబోతలో శ్రీరెడ్డి టాప్ లో ఉంటుంది. అయితే తెలుగు సినిమా పరిశ్రమలో నటిగా రాణించాలనే లక్ష్యంతో ప్రయత్నించిన యాంకర్, న్యూస్ రీడర్ శ్రీరెడ్డి తనకు జరిగిన అన్యాయాలను మీటూ ఉద్యమంతో బయట పెట్టి సంచలనం రేపారు.
ఆ తర్వాత హైదరాబాద్ నుంచి చెన్నైకి మకాం మార్చిన ఆమె ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ వస్తున్నారు.ఈ క్రమంలో మాకు నెలవారీ జీతాలు చెల్లించడం లేదంటూ విడుదల చేసిన వీడియో వైరల్ అవుతున్నది. ఈ వీడియోలో ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే?