దు:ఖాన్ని ఆపుకోలేక బోరున ఏడ్చేసిన మంత్రి అమర్‌నాధ్‌. వైరల్ వీడియో.

ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అనకాపల్లిలో వైసిపి కార్యాలయంలో కొత్త నియోజకవర్గ ఇన్చార్జిగా సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించిన మలసాల భరత్ కుమార్ పరిచయ సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాను అనకాపల్లి నియోజకవర్గం వీడి వెళుతున్నందుకు బాధగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

తీవ్ర భావోద్వేగానికి లోనైన గుడివాడ అమర్‌నాథ్ ఎంతో బాధతో వెళుతున్నా.. కానీ మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటానంటూ ఎమోషనల్ గా మాట్లాడారు. ఈ సమావేశంలో మంత్రి అమర్‌‌నాధ్ కంటతడి పెట్టుకున్నారు. తనను ఆదరించిన అనకాపల్లిని వదిలివెళ్లిపోవాలంటే కష్టంగా ఉందని, అయితే హైకమాండ్ ఆదేశాలను పాటించాల్సిందేనని అమర్ నాధ్ అన్నారు.

తనకు అనకాపల్లి వదిలి వెళ్లాలంటే బాధగా ఉందన్న అమర్‌నాధ్ కొత్త ఇన్‌ఛార్జి మలసాల భరత్ కుమార్ కు సహకరించాలని కోరారు. తనకు సహకరించినట్లే ఆయన గెలుపునకు కూడా కృషి చేయాలని గుడివాడ అమర్‌నాధ్ కార్యకర్తలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *