కాంగ్రెస్ లో విలీనం చేయడానికే షర్మిల మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు ఆమె ముఖ్యనేతలకు సంకేతాలు ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం లోటస్ పాండ్ లో అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఈ భేటీలో షర్మిల కాంగ్రెస్ లో విలీనంపై ఆమె క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైఎస్ షర్మిల క్రిస్మస్ కానుకను పంపారు.
చంద్రబాబు కుటుంబ సభ్యులకు షర్మిల క్రిస్మస్ శుభాకాంక్షలు అందచేశారు. కానుకతో పాటు ప్రత్యేకంగా షర్మిల పంపిన సందేశం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ” ది వైఎస్సార్ ఫ్యామిలీ విషెస్ యూ.. ఏ డిలైట్ఫుల్ క్రిస్మస్ అండ్ ఏ బ్లెస్డ్ 2024 అంటూ షర్మిల సందేశాన్ని పంపారు. ప్రతి సందేశాన్ని…. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా నారా లోకేష్ నెటిజన్లతో పంచుకున్నారు. వైఎస్ షర్మిలకు ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తమ కుటుంబానికి అద్భుతమైన కానుకలను పంపినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ప్రతి సందేశాన్ని పంపారు. నారా కుటుంబం తరుపున మీకు, మీ కుటుంబానికి క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.