న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రం నుంచి ఓ ఖతర్నాక్ పోస్టర్‌ను టీమ్ వదిలిన సంగతి తెలిసిందే. ఈ నెల 8న దీనికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను టీమ్ విడుదల చేయనుంది. అది అలా ఉండగా తారక్ రీసెంట్‌గా ఓ షార్ట్ వెకేషన్ కోసం జపాన్ దేశం వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ అక్కడ ఊహించని విధంగా భూకంపం వచ్చింది. భారీగా ఆస్తి నష్టం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్‌కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.
దేవర సినిమా షూటింగ్ కోసం జపాన్ వెళ్లారు ఎన్టీఆర్. దాదాపు వారం రోజులు అక్కడే ఉన్నారు. షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ కావడంతో జనవరి 1న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే జపాన్ లో ఎన్టీఆర్ ఉన్న ఏరియాలోనే భారీ భూకంపం వచ్చింది. సోమవారం ఒక్కరోజే దాదాపు 21సార్లు భూమి కంపించింది. అయితే ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చిన తర్వాత భూకంపం రావడంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.

జపాన్‌లో భూకంపంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జూనియర్ ఎన్టీఆర్. ‘‘గతవారమంతా అక్కడే ఉన్నాను. ఆ ప్రాంతంలోనే భూకంపం రావడం నా హృదాయన్ని కలిచివేసింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు త్వరగా కోలుకోవాలి‘‘ అంటూ ‘ఎక్స్‘లో ట్వీట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. అయితే జపాన్ లో వరుసు భూకంపలు రావడంతో అక్కడ సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు.