భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. గోవా నుండి వచ్చిన నమూనాలో 15కరోనా కేసులు కొనుగొన్నారు. చివరిసారిగా వచ్చిన కరోనా వేరియంట్ కంటే ఈసారి వచ్చిన వేరియంట్ ప్రమాదం ఉన్నట్టు చెబుతున్నారు. దీని కారణంగా ప్రభుత్వం కూడా కరోనా వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. అయితే మూడేళ్ల కిందట ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మరోసారి కోరలు చాస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన మహమ్మారి ఒక్కసారిగా విజృంభిస్తోంది.
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు అమాంత పెరిగాయి. ఒకవైపు కొవిడ్ కేసులు పెరుగుతుంటే.. మరోవైపు కొత్త వేరియంట్ బయటపడి మరింత కలవరపెడుతోంది. ఇటీవలే కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1 గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన జేఎన్.1 కేసులు దేశంలో 21 నమోదైనట్లు ఇండియన్ సార్స్ కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం వెల్లడించింది. కొత్త వేరియంట్‌తో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడానికి ఈ కొత్త వేరియంట్ కారణమని తెలుస్తోంది.

ఇక ఈ కొత్త వేరియంట్ లక్షణాల విషయానికొస్తే.. వైరస్ సోకిన వారిలో జ్వరం, ముక్కు కారడం, గొంతు మంట, తలనొప్పి, విపరీతమైన అలసట, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కొన్ని సందర్భాల్లో జీర్ణశయాంతర లక్షణాలు కూడా కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలు రెండు రోజుల పాటు కొనసాగితే మాత్రమే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.