ఇటీవలే ప్రగతి ఆమె కూతురు పుట్టినరోజు సందర్భంగా ఓ పార్టీ చేసింది. దీంతో ఈ నటికి 16ఏళ్ల కూతురు ఉందని ఎవరు ఊహించలేదు. ఆమె పేరు అమ్ము.. అలాగే అంతకంటే పెద్ద కొడుకు కూడా ఉన్నాడు.. వీరితోనే జీవితాన్ని కొనసాగిస్తున్నప్రగతి పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో చెప్పడానికి అంతగా ఇష్టపడదు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు ప్రగతి. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు ప్రగతి. ఈ మధ్య కాలంలో ప్రగతి ఎదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
అమ్మ, అత్తా, వదిన పాత్రల్లో ఎంతో చక్కగా ఒదిగిపోయి మరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు ప్రగతి. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంటారు ప్రగతి. జిమ్లో వర్కౌట్స్ చేస్తున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది ఈ సీనియర్ బ్యూటీ. అంతే కాదు అందంతోనూ కవ్విస్తూ ఉంటుంది ప్రగతి. ఇటీవలే జాతీయ స్థాయిలో సత్తా కూడా చాటింది ప్రగతి. ప్రగతి ఫిట్నెస్, వెయిట్ లిఫ్టింగ్ వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. దాంతో అర్ధం చేసుకోవచ్చు ఆమెకు వెయిట్ లిఫ్టింగ్ అంటే ఇష్టం. ఇటీవలే బెంగళూరులో 28వ బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ జరిగింది.
ఆ పోటీలో ఏకంగా మూడో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇదిలా ఉంటే ప్రగతి ఎంత అందంగా ఉంటారో ఆమె కూతురు కూడా చాలా అందంగా ఉంది. ప్రగతి కూతురిని ఎప్పుడైనా చూశారా..? ప్రగతి కూతురు పేరు గీత. తల్లికి తగ్గట్టుగా అందంగా ఉంది గీత. తాజాగా ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల కూతుర్లు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అలాగే ప్రగతి కూతురు కూడా సినిమాల్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.