రేవంత్‌ అన్నా అని పిలవగానే వెంటనే స్పందించిన CM, ఆ హాస్పిటల్ బిల్ మొత్తం వెనక్కి..!

సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం నాడు.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించేందుకు సోమాజీగూడలోకి యశోద ఆప్పత్రికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఆస్పత్రిలోకి రాగానే.. అక్కడే ఉన్న ఓ యువతి.. రేవంత్ అన్నా అంటూ నోరారా పిలిచింది. అయితే తుంటి ఎముక ఫ్యాక్చర్‌తో యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పరామర్శించేందుకు ఆదివారం సీఎం రేవంత్ ఆస్పత్రికి వెళ్లారు.

కేసీఆర్‌ను పరామర్శించి తిరిగి వెళ్తుండగా రేవంత్ అన్నా అంటూ ఓ మహిళ పిలిచింది. మహిళ పిలిచిన వెంటనే స్పందించిన సీఎం.. ఆమె దగ్గరికి వెళ్లి సమస్య ఏంటో చెప్పమని అడిగారు. దీంతో తన పాపకు ఆస్పత్రి ఖర్చు చాలా అవుతోందని, సాయం చేయాలని మహిళ కోరింది. వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సామాన్యులు పిలవగానే పలికిన సీఎం రేవంత్ వ్యక్తిత్వంపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సీఎం అంటే ఇలా ఉండాలి అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *