హాస్పిటల్ కి వెళ్ళగానే సీఎం రేవంత్ చూసి కేసీఆర్ ఏం అన్నాడో చుడండి.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన మార్క్ ఏంటో చూపిస్తున్నారు. పాలనా పరంగా నాలుగు రోజుల్లోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్యారంటీల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజా దర్బార్ ప్రారంభించారు. రాజకీయంగా విభేదించినా..ముఖ్యమంత్రిగా మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం పై స్పందించారు. కేసీఆర్ ఫాం హౌస్ లో జారి పడి తుంట ఎముక విరిగింది. దీంతో, హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రి లో కేసీఆర్ కు శస్త్ర చికిత్స చేసారు.

అయితే తెలంగాణ రాజకీయాల్లో ఓ అరుదైన సీన్ కనిపించనుంది. కేసీఆర్‌ ను యశోద ఆస్పత్రిలో సీఎం రేవంత్ పరామర్శించనున్నారు. ముందుగా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్.. యశోద ఆస్పత్రికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ యోగ క్షేమాలు తెలుసుకోనున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఆరోగ్యం గురించి సీఎం రేవంత్ వాకబు చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీని యశోద ఆస్పత్రికి పంపి ఎప్పటికప్పుడు వివరాలు తెలపాలని ఆదేశించారు. ఇప్పుడు నేరుగా సీఎం రేవంత్ ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించనున్నారు. వ్యక్తిగత ఆరోపణలు, దూషణలే రాజకీయాలుగా మారిన ఈ రోజుల్లో ప్రత్యర్థి ఆరోగ్యపరంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పరామర్శించడం అంటే నైతికంగా మంచి మార్కులు పడినట్లే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *